సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ సీఎం వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఏపీ వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ‘ప్రజాపోరు’ నిరసన ర్యాలీ చేపట్టింది. నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అయితే, ఈ ర్యాలీలకు ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు ముందుగానే స్పష్టం చేశారు అయినప్పటీకి అధికారుల ఆదేశాలను వైసీపీ ఏ మాత్రం లెక్కచేయకుండా.. పేద మధ్యతరగతి విద్యార్థుల భవిషత్తు ను ప్రభుత్వం నాశనం చేస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై ర్యాలీ చేపట్టాడడం దానిని పోలీసులు అడ్డుకోవడంతో పలు చోట్ల ఉద్రిక్తలు నెలకొన్నాయి. గుంటూరు జిల్లాలో వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు వైసీపీ నాయకులకు కంకరగుంట ఫ్లైఓవర్‌ దగ్గర పోలీసులు అడ్డుగా పెట్టిన బారికేట్లను తనదయిన శైలిలో త్రోసివేసి తన కార్యకర్తల ర్యాలీ ని ముందుకు తీసుకొనివెళ్ళారు. ఈ దశల్లో పోలీసులతో జై జగన్ అంటూ నినాదాలతో వైసీపీ నేతలు హోరాహోరీ తో ఉద్రిక్తత నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం నరసాపురం నిడదవోలు, తణుకు తాడేపల్లి గూడెం లలో స్థానిక వైసీపీ నేతలు నిరసన ర్యాలీలు నిర్వహించారు. (ఫై ఫోటో నిడదవోలు YSRCP పార్టీ మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *