సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రష్యా అధ్య క్షుడు పుతిన్ భారత్ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘మేకిన్ ఇండియా’ విధానాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ అభినందించారు. ఈ విధానాల అమలుకు ప్రధాని మోదీ చూపిస్తోన్న చొరవను మెచ్చుకున్నారు. సాంకేతికంగా భారత దేశం స్వయం సమృద్ధి బాటలో ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రోత్సహించే విషయంలో ఆయన సరైన రీతిలో ముందుకు వెళ్తున్నారని, ఇదే మంచి మార్గం అని కొనియాడారు. వ్లాదివోస్తోక్లో జరిగిన ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్లో రష్యా తయారీ కార్ల గురిం చి మీడియా అడిగిన ప్రశ్నకు ఈ విధం గా ప్రధాని మోడీని ఉదహరిస్తూ సమాధానం ఇచ్చారు.
