సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అతి తక్కువ ఓటర్లు ఒక్కొక్క రాష్ట్రంలో 60 శాసన సభ స్థానాలు చప్పున కలిగి ఉన్న 3 ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో నేటి గురువారం జరుగుతున్నా ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ లో భాగంగా తాజా సమాచారం ప్రకారం ( మధ్యాహ్నం 12 గంటలకు ) త్రిపుర, మేఘాలయలో మళ్లీ బీజేపీ కాషాయ జెండా రెపరెపలాడుతోంది. ఇక మేఘాలయ ఫలితం మాత్రం హంగ్ దిశగా వెళ్తోంది. మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలులో ఆధిక్యంలో ఉన్న పార్టీలు: త్రిపురలో బీజేపీ కూటమి 32 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ వామపక్షాల కూటమి 17 చోట్ల ముందంజలో ఉంది. టీఎంపీ (తిప్రా మోథ్రా పార్టీ) 12 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక నాగాలాండ్ రాష్ట్రంలో బీజేపీ -ఎన్డీపీపీకూటమి స్పష్టమైన ఆధిక్యం సంపాదించింది. బీజేపీ 39 స్థానాలలో ఆధిక్యతలో ఉండగా కాంగ్రెస్ 2 ఇతరులు 19 స్థానాలలో ఆధిక్యతలో ఉండటం విశేషం. మేఘాలయలో ఇప్పటి వరకు ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించలేదు. ఇక్కడ కాన్రాడ్ సంగ్మా సారథ్యంలోని ఎన్పీపీ 27, బీజేపీ 5, కాంగ్రెస్ 5 యూడీపీ 8 టీఎంసీ 5 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
