సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈసారి ఏపీలో ఎన్నికలకు ఎక్కువ సమయం ఉండటంతో 175 స్థానాలలో ప్రత్యేక ద్రుష్టి పెట్టి అన్ని చోట్ల గెలుపు ను సాధించాలని సీఎం జగన్ వైసీపీ శ్రేణులను ఆదేశించడంతో పాటు.. ఆయనే స్వయంగా ఎక్కువ నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనే ప్యూహంతో .. ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర మొదలు పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృ ష్ణారెడ్డి నేడు, మంగళవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ.. బస్సు యాత్ర రూట్ మ్యాప్ ప్రకారం గతంలో జరిగిన 4 సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలు కాకుండా, మిగిలిన ప్రాంతాల్లోబస్సు యాత్ర జరుగుతుం దన్నారు. సిద్ధం సభలో లక్షలాది మం ది పాల్గొన్నారన్నారు. జగన్ గత ఎన్నికల మేనిఫెస్టోలో 99 శాతం అమలు చేసి చూపించారని సజ్జల అన్నారు. ఈ ఐదేళ్లలో 20 ఏళ్ల అభివృ ద్ధిని చేసి చూపించాం. సిద్ధం సభలు జాతీయ స్థాయిలో పేరు పొందాయి. దీనికి కొనసాగింపుగా ‘మేమంతా సిద్ధం ’ పేరుతో జగన్ బస్సు యాత్రచేస్తారు. ప్రతి పార్లమెం టు నియోజకవర్గం పరిధిలో కనీసం రెండు అసెం బ్లీ నియోజకవర్గాలో యాత్ర ఉండేలా చూస్తున్నాం . తొలిరోజు ప్రొద్దుటూరులో సభ ఉంటుంది. రెండవ రోజు నంద్యా ల, లేదా ఆళ్లగడ్డలో ఇంటరాక్షన్. నంద్యాలలో బహిరంగ సభ. 29న ఎమ్మి గనూరులో సభ ఉంటుందని సజ్జల ప్రకటించారు.
