సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పుంగనూరు ప్రాంత అభివృద్ధి కోసం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నాంది పలికిన టయోటా కంపెనీ, వాటర్ గ్రిడ్ పనులను కావాలంటే క్రెడిట్ మీరే తీసుకుని అయినా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాధినేతలను కోరుతున్నానని రాజంపేట లోక్ సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నేడు, సోమవారం విజ్ఞప్తి చేసారు. ఈరోజు నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎంతో వెనుకబడిన పుంగనూరు ప్రాంత అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా తాము ఎంతో చేసామన్నారు.అందులో భాగంగా ప్రఖ్యాత టయోటా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థను తెచ్చామని, వారికి అన్ని మౌలిక వసతి సౌకర్యాలు కల్పించడంతో శంకుస్థాపన కూడా చేశారన్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి వాటాలతో ప్రతి గ్రామానికి పైప్ లైన్ల ద్వారా తాగునీరు అందించే వాటర్ గ్రిడ్ పథకం అమలుకు సిద్ధం చేసామని గుర్తుచేశారు.వేలాది మందికి ఉపాధి కల్పించి, లక్షలాది మందికి దాహర్తి తీర్చే ఆ రెండు పనులను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మీడియా ద్వారా కోరుతున్నానన్నారు.
