సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు, ఆదివారం నోవాటెల్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ లో జనసేన కార్యక్రమాలు ఎలా చేసుకోవాలో వైసీపీ చెబుతుందా?.. మేం ఎక్కడికి వెళ్తామో వైసీపీ నేతలకు ముందే చెప్పాలా? అని ప్రశ్నించారు. నా కార్యక్రమం అజెండాలో రాజధానుల అంశం లేదని, ఇక్కడ విశాఖ ప్రజా గర్జన కు పోటీగా తాను రాలేదని, ఉత్తరాంధ్ర పర్యటనను 3 నెలల క్రితమే ఖరారు చేశామని అయితే ఇప్పడు ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే జనవాణి కార్యక్రమం చేపట్టామని, విధానపరంగా నిర్ణయాలు తీసుకోవాలనేది జనసేన సిద్ధాంతమని చెప్పారు. వైసీపీ నేతలవి ఎప్పుడు బూతు పురాణాలే తప్ప..వారు ప్రజా సమస్యలను పరిష్కారించలేదని విమర్శించారు. సీఎం జగన్ నుద్దేశించి..గతంలో ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్న వ్యక్తి కిందే, ఇప్పుడు పోలీసులు పనిచేస్తున్నారని , మంత్రులపై దాడి కి తనకు సంబంధం లేదని, అయితే నాతో పాటు లాడ్జి లో బసచేసిన అమాయకులను రాత్రి పుట పోలీసులు అరెస్టు చెయ్యడం దారుణం అన్నారు. . ‘మేము ఏమైనా సంఘ విద్రోహ కార్యక్రమాలు చేస్తున్నామా?.. పోలీసులు నేరస్థులకు కొమ్ముకాయండి… సమస్యలపై ప్రశ్నించే వాళ్ల గొంతు నొక్కేయండి’ అంటూ వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకా హత్య కేసును ఇంతవరకు ఎందుకు పరిష్కరించలేదని పవన్ ప్రశ్నించారు. కానీ పోలీసులు నిర్ణయాలు తీసుకోరు.. ప్రభుత్వ సూచనలు పాటిస్తారని, నిన్న జనసేన కార్యకర్తలపై పోలీసులు జులుం చూపారని పవన్ ఆరోపించారు. అరెస్ట్ చేసిన జనసేన నేతలను విడుదల చెయ్యాలని డిమాండ్ చేసారు.
