సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ టీడీపీ అడ్జక్షుడు అచ్చెన్నాయుడు నేడు, శనివారం మీడియా సమావేశంలో మే 27, 28 తేదీల్లో రాజమండ్రి లో మహానాడు నిర్వహిస్తామని ప్రకటించారు. 27న 15 వేల మందితో ప్రతినిధుల సభ, 28న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. ఈసారి మహానాడుకు 2 చోట్ల వేదికలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. మహానాడు నిర్వాహణ కోసం 15 కమిటీలు నియమించామని, రెండు రోజుల్లో కమిటీలను ప్రకటిస్తామని ప్రకటించారు . మే 28న ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు.. 15 లక్షల మంది హాజరవుతారని దానికి తగిన ఏర్పాట్లు చేస్తామని అచ్చెన్నాయుడు ఆశాభావం వ్యక్తం చేసారు. గోదావరి జిల్లాలో కోల్పోయిన తెలుగు దేశం పట్టు తిరిగి పునరుద్ధరించుకొనే సంకల్పం తో టీడీపీ శ్రేణులు రాజమండ్రి మహానాడును ప్రతిష్టాకరంగా తీసుకున్నాయని నేతలు అంటున్నారు.
