సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల హ్యాట్రిక్ విజయాలు పూర్తీ చేసిన సీనియర్ హీరో బాలకృష్ణ హోస్టుగా ఆహా ఓటీటీలో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే ‘ సెలబ్రెటీలు అడిగే ప్రశ్నలు, ఆడించే ఆటలు జనాలకి మంచి కిక్ ఇస్తాయని అందరికి తెలిసిందే.. ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా మూడో సీజన్‌లోకి అడుగుపెట్టింది. రీసెంట్‌గా ‘భగవంత్ కేసరి’ టీమ్ హంగామాతో మూడో సీజన్ మొదలైంది. ఈ షో ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌కు చేరింది. పాన్ ఇండియా రేంజ్ షోకి సంబంధించిన ప్రోమోని తాజాగా ‘వైల్డెస్ట్ ప్రోమో’ అంటూ మేకర్స్ నేడు, శనివారం ఓ వీడియోని విడుదల చేశారు. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ , నేషనల్ క్రష్ రష్మిక మందన్నాహీరోహీరోయిన్లుగా అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రం ‘యానిమల్’. ఈ మూవీ ప్రమోషన్స్ నిమిత్తం హీరో, హీరోయిన్‌లతో కలిసి దర్శకుడు ఈ షోలో పాల్గొన్నారు. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తూ.. వైరల్ అవుతోంది. దర్శకుల గురించి బాలయ్య అడుగుతూ బోయపాటి పేరు చెప్పగానే ప్రతి యాక్షన్ ఎపిసోడ్ గుడిలో ఉంటుందని సందీప్ చెప్పారు. అనంతరం రణబీర్ కపూర్ గ్రాండ్ ఎంట్రీ. రాగానే ‘ఫ్లూటు జింక ముందు ఊదు. సింహం ముందు కాదు’ అనే డైలాగ్ చెప్పడంతో అక్కడ కూర్చుని ఉన్న ప్రేక్షకులు ఈలలు, అరుపులతో హోరెత్తించారు. రష్మిక వచ్చినప్పటి నుంచి బాలయ్య మనసు కంట్రోల్ తప్పింది. ‘నా మనసు బ్యాలెన్స్‌లో లేదిక, ఎందుకో మైండ్ అంతా తికమక. వచ్చేయమ్మా రష్మిక’ అని పిలిచిన బాలయ్య.. ఆమె రాగానే గులాబీ ఇచ్చి, ఆమెతో కలిసి స్టెప్పులేశారు. ‘రష్మిక . నువ్వు చాలు ఆ ఇద్దరు ఎందుకు అంటూ రణబీర్, సందీప్‌లను పంపించేద్దాం అనగానే వారిద్దరూ లేచి వెళ్లిపోబోయారు. మొత్తానికి మంచి ఫన్ తో ఈ ప్రోమో ఉంది.
