సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ బాలీవుడ్ లో కూడా భారీ సినిమాల కోసం ఒక అగ్ర దర్శకుడికి 150 కోట్లు డబ్బు ఇవ్వడం ఫై ఐటి దృష్టి పెట్టడంతో డొంక కదిలి తెలుగు రాష్ట్రాలలోని మైత్రి మూవీస్ బ్యానర్ ఆఫీస్‌లపై దాదాపు 5 రోజులు (ఏప్రిల్ 19 నుంచి 24వ తేదీ వరకు) పాటు.. ఐటీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో మైత్రీ పెట్టుబడులకు సంబంధించి కీలక సమాచారాన్ని ఐటీ అధికారులు రాబట్టినట్లుగా తాజాగా నేడు, మంగళవారం సాయంత్రం మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మైత్రీ సంస్థలోకి సుమారు రూ. 700 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చినట్లుగా ఐటీ అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ముంబై బేస్డ్ కంపెనీకి ఆ విదేశీ పెట్టుబడులు బదిలీ అయినట్లుగానూ, ఆ తర్వాత ఏడు కంపెనీలకు వాటిని తరలించినట్లుగా ఐటీ అధికారులు కనుగొన్నారు. అలాగే మైత్రీ సంస్థలో ప్రస్తుతం ఓ హిట్ సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్ర హీరోకు, మరియు గత రెండేళ్లలో ఇద్దరు బడా హీరోలకు సైతం సైతం హవాలా రూపంలోనే పేమెంట్స్ జరిగినట్లుగా ఐటీ అధికారుల సోదాలో గుర్తించినట్లు సమాచారం. ఐటీ అధికారులు.. ఇప్పటికే అగ్ర హీరోల ఖాతాలను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయా హీరోలను ముంబైకి పిలిచి విచారణ జరిపే అవకాశం ఉందని జాతీయ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి, ఇదిలా ఉండగా ఇటీవల వీరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య లతో భారీ హిట్స్ కొట్టిన మైత్రి మూవీస్ ఇటీవల అల్లు అర్జున్ , సుకుమార్ ల కాంబినేషన్ లో పుష్ప 2 పాటు పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్ కాంబినేషన్ లో ‘ భవదీయుడు భగత్ సింగ్ సినిమాలు నిర్మిస్తూ ఉండటం గమనార్హం.
