సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఇటీవల మరణించిన రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈనెల 23న హైదరాబాద్‌లో జూబ్లిహిల్స్‌ నివాసంలో పెద్దదిన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తదుపరి కృష్ణంరాజు అమితంగా ఇష్టపడే స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు గ్రామంలో ఆయన నివాస వద్ద సంస్మరణ సభతోపాటు భారీ సమారాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వారసుడు ప్రభాస్‌ ఈనెల 28న మొగల్తూరు రానున్నారు. రెండు రోజులు స్వగ్రామంలోనే ఉంటారు. 29న ఆయన పెదనాన్న యూవీ కృష్ణంరాజుకు సంస్మరణ సభతోపాటు భారీ సమారాధనలో పాల్గొంటారు. సంస్మరణ అన్న సమారాధనకు 60 వేల మందికి పైగా భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం నుంచి వంట వాళ్ళు వస్తున్నారు. మెనూను సిద్ధ్దం చేశారు. చాల ఏళ్ల తర్వాత ప్రభాస్‌ మొగల్తూరు విచ్చేస్తుండడంతో ..భారీ స్థాయిలో జిల్లా నేతల,ప్రముఖుల పరామర్శలు నేపథ్యంలో.. వారి నివాసంలో ఆధునిక ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఇక్కడ సమీపంలోని భీమవరం కు చెందిన సన్నిహితులు, కృష్ణంరాజుకు, ప్రభాస్ మిత్రులు ఈ ఏర్పాట్లలో పాలు పంచుకొంటున్నారు. ఇంటికి రంగులతోపాటు లోపల ఫర్నీచర్‌ను మారుస్తున్నారు. ఏది ఏమైనా కృష్ణంరాజు సంస్మరణ సభ కాబ్బటి ప్రభాస్ అభిమానులు కాస్త సమన్వయంతో వ్యవహరించి పెద్దాయనకు ఘన నివాళ్లు అర్పించవలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *