సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ కేంద్ర మంత్రి రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మ రణ సభ కోసం భీమవరం కు సమీపంలోని ఆయన స్వ గ్రామం నేడు, గురువారం మొగల్తూరులో భారీ ఏర్పా టు చేసారు. నేటి .గురువారం మధ్యా హ్నం జరగనున్న ఈ కార్య క్రమంలో కృష్ణంరాజు వారసుడు హీరో ప్రభాస్ పాల్గొనడానికి మొగల్తూరు లోని స్వగృహానికి చేరుకొన్నారు. ఆయనకు ఈ కష్ట సమయంలో సంఘీభావం తెలపడానికి భీమవరం పట్టణం నుండి ప్రభాస్ అభిమానులు వందలాది మంది నేటి ఉదయం జేపీ రోడ్డు నుండి పంటకాలువ రోడ్డు మీదుగా బైకులపై కృష్ణం రాజు కు నివాళ్లు తెలుపుతూ ప్రభాస్ సినిమాలలోని స్టిల్స్ ప్లేక్సీలు కట్టుకొని భారీ ర్యాలీగా మొగల్తూరు తరలివెళ్లి అక్కడ హీరో ప్రభాస్ కు చేతులు ఊపుతూ ఆయనను ఉత్సహపరిచారు. ప్రభాస్ కూడా అభిమానులకు బిల్డింగ్ పైనుండి చేతులు ఊపుతూ కృతఙ్ఞతలు తెలిపారు.( ఫై తాజా చిత్రంలో ) నేటి మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు సుమారు 60 వేల మందికి పంచభక్షపరమణలతో భోజన ఏర్పాట్లు చేసారు. దీనిలో గోదావరి జిల్లాల వాసులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు. ఇప్ప్పటికే ప్రభాస్ ను చూసేం దుకు అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు. ఈ కార్యక్రమం లో ఏపీ మం త్రులు వేణు గోపాల కృ ష్ణ, ఆర్ కే రోజా, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరు ప్రసాద్ రాజు నేటి ఉడయమే ప్రభాస్ ను కలసి రాష్ట్ర ప్రభుత్వం తరపున సంతాపం తెలపడం జరిగింది. . ముఖ్య అతిథులకు ఆయన ఇంటి ఆవరణలో ఏర్పా టుచేశారు. మిగిలిన వారందరికీ కృ ష్ణంరాజు ఇం టికి దక్షిణం వైపు ఉన్న తోటలో ఏర్పా ట్లు చేశారు
