సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండ్రాజవరం మండలం వెలగదుర్రు గ్రామానికి చెందిన యల్లమిల్లి రవికుమార్ (38),పోలుమాటి శ్రీను (37), చోరపల్లి వీరబాబులు నాటుకోళ్లకు గాబులు (మెష్ గాబులు) కడుతూంటారు. వీరు ముగ్గురూ ట్రక్ ఆటోలో మెష్లు పట్టుకుని బాపట్ల జిల్లా రేపల్లె మండలం లోని చుట్టుపక్కల గ్రామాలకు బయలుదేరారు. గత అర్ధరాత్రి పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం దారితిప్ప గ్రామం వద్ద 216 జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో రవికుమార్, శ్రీను అక్కడి కక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నర్సాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వీరబాబు ప్రస్తుతం విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనతో ఉండ్రాజవరం మండలంలో మృతుల కుటుంబాల్లోవిషాద ఛాయలు అలముకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *