సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కేపీపాలెం దక్షిణ సముద్ర తీరంలో గత ఆదివారం సాయం త్రం జరిగిన ప్రమాదంలో 2 పదులుకూడా నిండని 19 ఏళ్ళ ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. దానితో వారి తల్లి తండ్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో గత రాత్రి తీవ్ర విషాదం నిండుకొంది. మృతులు .. రాజేష్ నరసాపురం వై.ఎన్.కళాశాలలో డిగ్రీ, అరవింద్ సీతారామపురం స్వ ర్ణాం ధ్ర కళాశాలలో ఇంజినీరింగ్ మొదటి ఏడాది చదువుతున్నా రు వివరాలు లోకి వెళ్ళితే .. కేపీపాలెం సౌత్ పంచాయతీలోని యాళ్లవారిమెరకకు చెందిన యాళ్ల రాజేష్ స్నేహితులతో కలిసి బీచ్‌కు వెళ్లి తన జన్మదిన వేడుక చేసుకున్నా రు. అనంతరం ముఖానికి అంటుకున్న కేకు క్రీమును శుభ్రం చేసుకునేందుకు సముద్ర అలల్లోకి వెళ్లగా ఊహించని విధంగా ఒక్క సారిగా ఎగసిపడిన భారీ కెరటం వారి పాలిట మృత్యువై కడలి లోపలికి తీసుకొనిపోయింది. బంధువులు, పోలీసులు గాలిం చగా మోళ్లపర్రు సమీపం లోని తీరంలో మృ కనిపించాయి.
