సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మొదటి కార్తీక సోమావారం కావడంతో భీమవరం గునుపూడి నందు వేంచేసి యున్న పంచా రామం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వారి దేవస్థానం లో నేటి తెల్లవారు జాము 3గంటల నుండి భక్తులు పోట్టెత్తిపోయారు. వేదపండితుల మంత్రోచ్ఛరణలతో, అభిషేకాలతో చంద్ర ప్రతిష్టగా భావించే సోమలింగం దివ్య తేజస్సుతో భక్తులను తన్మయభరితులను చేసింది. నేడు, సోమవారం దూరప్రాంతాల నుండి విశేషంగా భక్తులు వాహనాలలో వస్తున్నారు. నిన్న ఆదివారం కూడా విశేషంగా సుమారు 30వేల మంది పైగా భక్తులు స్వామివారిని దర్శించుకొన్నారు. నిన్న ఒక్క రోజు శ్రీఘ్ర దర్శనం టికెట్స్ అమ్మకం ద్వారా రూ.107995/-లు టికెట్స్ లడ్డు ప్రసాదం ద్వారా రూ.7005/-మొత్తం కలిపి 1,15, 000 /- ఆదాయం లభించినట్లు ( హుండీ ఆదాయం కాకుండా..) ఇఓ అరుణ కుమార్ తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తులకు వేగంగా దర్సనం చేయించేందుకు అన్ని ఏర్పాట్లు, ప్రసాద వితరణ, ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ( ఫై తాజా దృశ్యంలో సోమేశ్వరుని అభిషేకం..)
