సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం జగన్ నేడు,శుక్రవారం నర్సీ పట్నం బహిరంగ సభలో మాట్లాడుతూ.. తాజాగా నర్సీ పట్నం లో రూ.986 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశామని, రూపు రేఖలు మార్చబోతున్నమన్నారు. ఇచ్చిన ప్రతిమాట నిలబెట్టుకుంటాం అని అన్నారు. ‘‘రాష్ట్రంలో చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం జరుగుతోంది. చంద్రబాబు నేతృత్వంలో దుష్టచతుష్టయం చేస్తున్న పాపాలలో పవన్ కళ్యాణ్ కు భాగముంది. పెంక్షన్స్ లఫై నిబంధనల ప్రకారం ప్రతీ ఆరు నెలలకు పెన్షన్ వెరిఫికేషన్ చేయాలి. అయితే అసత్య ప్రచారం చేస్తున్నారు’’ మరి ‘‘చంద్రబాబు పాలనలో ఒక్క మంచి పనైనా జరిగిందా? దత్తతండ్రిని దత్తపుత్రుడు నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారు. వారు ఈ రాష్ట్రంలో రచ్చ చేస్తారు తప్ప ఇక్కడ ఉండరు. వారికి ఈ రాష్ట్రం కాకుంటే.. మరో రాష్ట్రం .. ఈ ప్రజలు కాకుంటే.. మరో ప్రజలు.. ఈ భార్య కాకుంటే మరో భార్య అన్నదే వారి తీరు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చేవి వెన్నుపోటు, మోసాలు. అన్ని వర్గాలను మోసం చేసిన బాబును ప్రజలు ఎందుకు నమ్ముతారు’’ చంద్రబాబు పబ్లిసిటీ షూటింగ్ పిచ్చతో మొన్న ఇరుకు సందులో పెట్టి 8 మందిని చంపాడు.. గోదావరి పుష్కారాలు అప్పుడు 29 మందిని చంపాడు అని ఆరోపించారు. రాజకీయం అంటే డైలాగులు కాదు, డ్రోన్ షాట్లు, డ్రామాలు కాదు. రాజకీయం అంటే రైతు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, నిరుపేద,మధ్య తరగతి కుటుంబంలో మార్పులు తీసుకురావాలి’’ అని సీఎం పేర్కొన్నారు. బీసీల తోకలు కత్తిరిస్తా అన్న వ్యక్తి చంద్రబాబు. ఎస్సీ ల్లోఎవరైనా పుట్టాలని కోరుకుంటారా? అన్న వ్యక్తి చంద్రబాబు ఇప్పడు నీచ రాజకీయాలు చేస్తున్నారు అని విమర్శించారు.
