సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రకృతి విలయం తో ఆఫ్రికా దేశం మొరాకో వణికిపోయింది.. గత శుక్రవారం అర్ధరాత్రి రాత్రి సమయం లో మొరాకోలో భారీ భూకంపం సంభవించింది. రాత్రి 11.11 సమయం లో మధ్య మొరాకో మర్రకేచ్ నగరం కేంద్రంగా రిక్టర్ స్కేల్ 6.8 త్రీవతతో భూకంపం సంభవించింది. స్థానిక ఆసుపత్రులు గాయాలయిన వారితో నిండిపోయాయి. 300 మంది పైగా మృతి చెంది ఉంటారని అధికారులు భావిస్తున్నా రు. ఎటు చూసినా భవనాలు కుప్ప కూలిపోయి.. అయిన వాళ్ల కోసం ఆర్తనాదాలు పెడుతున్న హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ దుర్ఘటనపై భారత ప్రధాని మోడీ తో పాటు ఢిల్లీలో జి 20 సమావేశానికి హాజరు అయిన వివిధ దేశాల అగ్రనేతలు తీవ్ర దిగ్బ్రాంతి , మృతులకు సంతాపము వ్యక్తం చేసారు.
