సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంపట్టణానికి 9 కిమీ దూరంలో ఉన్న మోగల్లులో తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని.. భార్య, ఆమె బంధువులు ఓ మహిళను స్తంభానికి కట్టేసి చితకబాదిన ఘటనవాటి వీడియోలు వైరల్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు విషయంలోకి వెళ్ళితే.. మోగల్లు గ్రామంలో సుబ్బారావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుబ్బారావు అదే గ్రామానికి చెందిన మరో ఒంటరి మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. రెండు నెలల క్రితం పక్క మండలమైన అత్తిలిలో అద్దెకు ఇల్లు తీసుకుని ఆమెతో సహజీవనం సాగిస్తున్నాడు, ఆస్తి పత్రాలు మొత్తం ఆమెకు ఇచ్చాడు అని ఆరోపణ.. ఈ క్రమంలోనే విసిగిపోయిన సుబ్బారావు భార్య, కుటుంబ సభ్యులు గత బుధవారం అత్తిలికి వెళ్లారు. అక్కడ అద్దె ఇంట్లో ఉంటున్న భర్త సుబ్బారావుని, ఒంటరి మహిలను గ్రామానికి తీసుకొచ్చారు. అనంతరం ఊరిలోని గుడి వద్ద ఉన్న స్తంభానికి ఆ ఒంటరి మహిళను కట్టేసి చిత్ర హింసలు పెట్టినట్లు సమాచారం. కొందరు గ్రామస్తులు ఫోన్ చెయ్యడంతో పాలకోడేరు రురల్ పోలీసులు అక్కడికి చేరుకుని ఆ మహిళను విడిపించి బాధిత మహిళను భీమవరం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సుబ్బారావు భార్యను ఆ మహిళపై దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *