సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: స్వతంత్ర సమరయోధుడు గా బ్రిటిష్ వారి గుండెలను దడ దడ లాడించిన స్వర్గీయ అల్లూరి సీతారామరాజు పుట్టిన వీర భూమి భీమవరం పట్టణానికి 9 కిమీ దూరంలో ఉన్న పాలకోడేరు మండలం మోగల్లు గ్రామం లో జులై 4వ తేదీ అల్లూరికి 128వ జయంతి పురస్కరించుకుని ఆయన జ్ఞాపకాలను ఈ ప్రాంతంవారు పదికాలాలు పదిలపరిచే విధంగా అల్లూరి సీతారామరాజు స్మారక మందిరం ట్రస్ట్‌ సభ్యుల ఆధ్వర్యంలో ప్రశాంత వాతావరణంలో 4 సెంట్లు స్థలంలో రూ. 55లక్షలతో .. ధ్యాన మందిరం నిర్మించారు. ఈ ప్రారంభోత్సవాన్ని ఒక వేడుకగా రేపు శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదిక నుంచి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఈ భవనాన్ని ఆన్ లైన్ లో వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఉండి ఎమ్మెల్యే రఘురామా కృష్ణంరాజు పాల్గొనే అవకాశం ఉంది. 2022 నుంచి ట్రస్ట్‌ సభ్యులు ధ్యాన మందిరాన్ని నిర్మించేందుకు కృషి చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *