సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గంలో మోడరన్ గ్రామంగా చిన అమిరం అన్ని వసతులతో ఆధునికత సంతరించుకొని ఎంతో అభివృద్ధి చెందిందని, రాష్ట్రంలో మోడరన్ గ్రామానికి నిదర్శనం చిన అమిరమేనని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. భీమవరం మండలం చిన అమిరం గ్రామంలో సుమారు 30 లక్షలతో వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ (ఆలమ్) కు ఎమ్మెల్యే అంజిబాబు శంకుస్థాపన చేశారు. భీమవరంలోని చిన అమిరంలో మరింత స్వచ్ఛమైన తాగునీరును అందిస్తామని, భీమవరం నియోజకవర్గంలోని శివారు ప్రాంతానికి కూడా మైక్రో పిల్టర్ లతో సుద్దిచేసిన స్వచ్ఛమైన తాగునీరును అందిస్తామని అన్నారు. టీడీపీ రాష్ట్ర బ్యూరో , తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ.. భీమవరం నియోజకవర్గం అభివృద్ధిలో శరవేగంగా దుసుకుని పోతుందని అన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బుద్దరాజు శ్రీనివాస్ రాజు, గొట్టుముక్కల రామసీతా, కోమటి రవి, గొట్టుముక్కల బంగార్రాజు, ఎంపిపి పేరిచర్ల విజయ నరసింహరాజు, కౌరు పృథ్వి శంకర్, కోళ్ల నాగబాబు,కారుమూరి సత్యనారాయణ మూర్తి కోళ్ల సీతారామ్, కిరణ్, కొత్తపల్లి ఏసు, తదితరులు పాల్గొన్నారు.
