సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారతదేశంలో నేడు, గురువారం బ్రిటన్ ( యునైటెడ్ కింగ్‌డమ్) ప్రధాని స్టార్మర్ పర్యటన నేపథ్యంలో నేడు, గురువారం ప్రధాని మోడీ ఆయనతో ముంబై లో సమావేశం అయ్యి కొత్త ఒప్పందాలు చేసుకొన్నారు. ఈ సందర్భముగా మోడీ మాట్లాడుతూ.. భారత దేశానికి పంపిన అతిపెద్ద వాణిజ్య మిషన్ ఇది భారత్-యుకె వాణిజ్య భాగస్వామ్యాన్ని అత్యంత ముఖ్యమైనదిగా అభివర్ణించారు. గత జూలైలో రెండు దేశాల మధ్య జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) అత్యంత ముఖ్యమైనదని బిట్రన్ ప్రధాని స్టార్మర్ అన్నారు. తాము యూరోపియన్ యూనియన్ నుండి నిష్క్రమించినప్పటి నుండి మేము కుదుర్చుకున్న అతిపెద్ద ఒప్పందం ఇది అని స్టార్మర్ తెలిపారు. అంతేకాదు, ఇది భారతదేశం ఇప్పటివరకు కుదుర్చుకున్న అతిపెద్ద వాణిజ్య ఒప్పందం కూడా అని తాను భావిస్తున్నానని బ్రిటన్ ప్రధాని తెలిపారు.రెండు దేశాల మధ్య ఏటా £25.5 బిలియన్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచే లక్ష్యంతో ఈ ఒప్పందం చేసుకున్నారు. ఇకపై బ్రిటిష్‌ ఉత్పత్తులపై భారత్‌ సగటు టారిఫ్‌ 15 శాతం నుంచి మూడు శాతానికి తగ్గనుందని బ్రిటన్ తెలిపింది. దీనివల్ల శీతల పానీయాలు, సౌందర్య సాధనాలు, కార్లు, వైద్య పరికరాలు వంటివి భారత మార్కెట్లో ఇంగ్లాండ్ ఉత్పత్తులు సులభంగా విక్రయించుకోవచ్చని తెలిపింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *