సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా నేడు,ఆదివారం విమర్శలు గుప్పించారు. ఏపీలో పవన్ కల్యాణ్ పరిస్థితి తెగిన గాలిపటంలా మారిందని , మొన్న విశాఖలో చంద్రబాబు ప్రోద్భలంతో ప్రధాని మోడీ ని కలిసినప్పుడు పవన్, జగన్ సర్కార్ ఫై అబద్దాలు చెపుదామని ప్రయత్నించగా, ‘ ఐ నో ఎవిర్తింగ్ ‘ .. అని అడ్డుకున్నారని , మీ ఫిర్యాదులను వినలేనని మీ గురించి అంత తెలుసునని ప్రధాని మోడీ పవన్ ముఖం మీద ఒక్కమాటతో చెప్పేశారని ఎద్దేవా చేసారు. మొన్న మోడీని తిట్టారు తరువాత పవన్ కలిశారు. ఎప్పుడు ఏ పార్టీతో కలుస్తారో ఆయనకే తెలియదని రోజా ఆక్షేపించారు. పవన్ రౌడీయిజంతో రోజుకో పార్టీ వైపు మాట్లాడుతుంటారని, పవన్ ప్రవర్తన ,ఆయన అభిమానుల ఆగడాలు చూసే ఆయనను మోదీ దూరం పెట్టారని రోజా విమర్శించారు.పవన్ పిల్ల సేనను ఇక్కడ రెచ్చగోటి హైదరాబాద్ వెళ్ళిపోతాడు కానీ పిల్ల సేనపై జగన్ సర్కార్ కన్నెర్ర చేస్తే వారికీ తట్టుకొనే శక్తి లేదని, వారి భవిషత్తులు కూడా నాశనం అవుతాయని హెచ్చరించారు.
