సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాకిస్తాన్ వార్తాపత్రిక ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ ప్రకారం, ఇటీవల జైలు లో ఉన్న ఇమ్రాన్‌ను కలిసిన తర్వాత ఆయన సోదరి అలీమా మీడియాతో మాట్లాడుతూ, ‘భారతదేశం నుంచి ఇంకా మరో దాడి జరగవచ్చని మా సోదరుడు ఇమ్రాన్ ఖాన్ అన్నారు.భారత్ ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్‌ను ద్వేషిస్తున్నారని.. కోపంతో మళ్ళీ దాడి చేయించే అవకాశం ఉందని చెప్పారు. ఇమ్రాన్ అంచనా ప్రకారం.. మోడీ యుద్ధంలో 60% మైండ్ గేమ్ ఆడుతున్నారని అని అన్నారని .. అదనుచూసి కచ్చితంగా భారత ప్రభుత్వం మళ్ళీ దాడి చేస్తుందని భయాందోళనలు వ్యక్తం చేశారు. పాకిస్థాన్ సైన్యం, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.’ ఇంకా, ఇమ్రాన్ ఖాన్ తరపున సైనిక కోర్టులో జరుగుతున్న కేసుల గురించి కూడా మాట్లాడారు. ఇమ్రాన్ ఖాన్ మే 9, 2023 నుండి జైలులో ఉన్నాడు. ఇటీవల యుద్ధ సమయంల , ఇమ్రాన్ ను విడుదల చెయ్యాలని మద్ధతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనలు, సైనిక స్థావరాలపై దాడులు కూడా చేశారు.
