సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో విపక్షాలు అన్ని ఏకమౌతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో 26 పార్టీల కూటమి ఇండియా’ (I.N.D.I.A) కూటమిగా అవతరించి మోడీ ప్రభుత్వం ఫై వచ్చే ఎన్నికలకు శంఖారావం పూరించిన విషయం విదితమే..పనిలో పనిగా నేడు, బుధవారం లోక్ సభలో ప్రతిపక్షలకు తగినంత బలం లేనప్పటికీ మోడీ సర్కార్ ఫై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. I.N.D.I.A కూటమిలో లో లేని కెసిఆర్ పార్టీ బీఆర్ఎస్ కూడా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడం విశేషం. ఇటీవల మణిపూర్ లో జారుతున్న అరాచకాలు, భారత మహిళా కుస్తీ యోధురాలపై బీజేపీ ఎంపీ లైయింగిక వేదింపులు అభియోగాలు,దేశంలో పెరిగిపోతున్న అధిక ధరలు. ప్రతిపక్ష నేతలు కేంద్రాన్ని ప్రశ్నిస్తుంటే.. దర్యాప్తు సంస్థలను ఉసిగొలుపుతున్నారని ప్రతి పక్షాలు మోడీ సర్కార్ ఫై చేస్తున్న ఆరోపణలకు పార్లమెంట్ సాక్షిగా బలమైన చర్చ జరగాలని దానితో బీజేపీ పాలన లో అసమర్థత లు ప్రజల దృష్టికి వస్తాయని ప్రతి పక్షాలు భావిస్తున్నాయి. దీనిలో భాగంగా.. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ సమర్పించిన ఈ తీర్మానానికి లోక్ సభ సభాపతి ఓం బిర్లా ఆమోదం తెలిపారు. అవిశ్వాస తీర్మానం ఫై చర్చకు తేదీని త్వరలోనే ఖరారు చేయబోతున్నారు అవిశ్వాస తీర్మానాన్ని అనుమతిస్తున్నట్లు తెలిపారు. దీనిపై చర్చ కోసం( తదుపరి సంఖ్యా బల నిర్ధారణ ఫై ఓటింగ్ ఉంటుంది) తగిన తేదీని నిర్ణయించేందుకు అన్ని పార్టీల నేతలతో చర్చిస్తానని చెప్పారు.
