సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్రంలోని మోడీ సర్కార్ దేశ ప్రజలకు శుభవార్త చెప్పబోతోంది. దీనికి కసరత్తులు పూర్తీ అయ్యాయి’ ఇక ఆచరణలోకి రావడమే ఆలస్యం.. ఇకపై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పేద సామాన్య ప్రజలకు ఇకపై ఇబ్బందులు పెట్టకుండా మెడిక్లైయిమ్ ప్రక్రియ వేగవంతం చేయడంపై చర్యలు చేపట్టింది. ఆరోగ్య బీమా క్లెయిమ్ ఆథరైజేషన్‌ను 1 గంటలో.. తుది సెటిల్మెంట్‌ను 3 రోజుల్లో పూర్తి చేయడం తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాలతో బీమా క్లెయిమ్, అప్లికేషన్ ఫారమ్‌లను సులభంగా అర్థం అయ్యేలా రూపొందించనుంది. ప్రతి భారత పౌరుడికి 2047 నాటికి ఆరోగ్య బీమా కల్పించాలనే లక్ష్యంతో కేంద్రం చర్యలు తీసుకుంటోంది. మెడిక్లెయిమ్ ప్రాసెసింగ్‌ను డిజిటల్‌గా ప్రమాణీకరించేందుకు నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చెయ్యాలని నిర్ణయించారు.
