సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జైలు లో ఉన్న చంద్రబాబుకి మద్దతుగా గత 2వారలు పైగా ఢిల్లీలో ఉంటున్నలోకేశ్, భార్య బ్రహ్మణి’ తెలుగుదేశం పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చిన ‘‘మోత మోగిద్దాం’’ కార్యక్రమానికి ఢిల్లీలో ఉన్న నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు నేడు, శనివారం సంఘీభావం తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా, చంద్రబాబు నిర్దోషి అని నమ్మేవారు దీనికి మద్దతు తెలపాలని కోరారు. ఒక వ్యక్తి కక్షతో చంద్రబాబు ను అరెస్ట్ చేశారని.. దాదాపు 20 రోజుల నుంచి జైల్లో ఉంచారన్నారు. త్వరలో చంద్రబాబు జైలు నుంచి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. మహిళాలోకం అందరూ కూడా మోత మోగిద్దాం కార్యక్రమానికి మద్దతు తెలపాలన్నారు. మద్యం నిషేధిస్తామని హామీ ఇచ్చి కూడా రాష్ట్రంలో మద్యం షాపులకు లైసెన్స్ మరో ఏడాది పొడగించారన్నారు. సోషల్ మీడియాలో ఇటీవల ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చారని తమకు మద్దతుగా పోస్టులు పెట్టిన వారికి వైసీపీ సోషల్ మీడియా రివార్డ్ ప్రకటించారని ఆరోపించారు.. చిల్లర పైసలకు సోషల్ మీడియా లో న్యూట్రల్ గా ఉండేవారు కక్కుర్తి పడవద్దని వ్యాఖ్యానించారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *