సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 3 నెలలుగా కాస్త సబ్డుగా ఉన్న నిత్యావసర వస్తువుల ధరలు ఆలా ఎన్నికలు ముగిశాయో లేదో, ఇలా ప్రజలకు పెట్రోల్ ధర 3 రూపాయలు పెంపుతో మొదలు కూరగాయలు పాలు,నూనె, సబ్బులు ఒకటేమిటి అన్ని నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో ఉల్లి పాయల, బంగాళా దుంపల ధర మరల కేజీ 50 రూపాయలకు ,టమాటా 70 రూపాయలకు ఎగబాకుతుంది. వంకాయ మొదలు ఏ కాయగూరలు కొనాలన్నా కేజీ 80 రూపాయలు నుండే మొదలు పెట్టాలి, పచ్చిమిర్చి గత వారం కేజి 150 రూపాయలు,కేజీ కొత్తిమీర 200 రూపాయలకు అమ్మరంటే ఏమనాలి?. ఇక ఇక పప్పులు ఉప్పులు,బియ్యం ధర, మాంసాహార ,ధరలు సరేసరి .. ఎన్నికల సమయంలో కూడా పెరుగుతూనే ఉన్నాయి, సబ్బులు, బాడీ వాష్ల ధర 2 నుంచి 9 శాతం పెరిగాయి. హెయిర్ ఆయిల్స్ ధర 8 నుంచి 11 శాతం పెరిగింది. కొన్ని ఆహార ఉత్పత్తుల ధరలను కంపెనీలు 3 నుంచి 17 శాతం పెంచేశాయి. గత ఏడాదితో పోలిస్తే సన్ ఫ్లవర్, మంచి నూనె ధరలు ఈ 2వారాలలో పెరుగుతూ పోతున్నాయి. పాలు, పంచదార, కాఫీ, కొబ్బరి, బార్లీ వంటి ప్రధాన ముడి పదార్ధాల ధరలు పెరుతున్నాయి. సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, ఈ ధరల పెంపు లో ప్రభుత్వాల బాధ్యత ఎంతన్నది అందరికి తెలిసిందే.. మరి చర్యలు ఎవరు తీసుకొంటారు.. ఎన్నికలు సమయంలో పెంచలేనిది ఇప్పుడు ఎలా పెంచగలుగుతున్నారు? ప్రజలలో ప్రభుత్వాలను ప్రశ్నించే చైతన్యం పెరగనంతవరకు.. తలా పాపం తిలాపిడికెడు..
