సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజలలో పాక్ ప్రేరిత ఉగ్రవాద చర్యలపై ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికా, రష్యా వెంటనే స్వాందించి భారత్ కు బలమైన సంఘీభావాన్ని ప్రకటించి ఇక ఉగ్రవాదులను మూలాలతో సహా ఏరిపారేయండి, మేము సహకరిస్తాం అని భరోసా ఇచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు ఈ ఉగ్రదాడిని గర్హించాయి. దేశంలోని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తో సహా అన్ని రాజకీయ పార్టీల నేతలు ప్రధాని మోడీతో. అమిత్ షా తో మాట్లాడి దేశంలోని కాశ్మిర్ రక్షణకు సంఘీభావం తెలిపారు. ఇప్పటికే కాశ్మిర్ లో ఉగ్రవాదులను ఏరివేసే కార్యక్రమంలో సైన్యం జల్లెడపడుతుంది. ఇక కేంద్ర ప్రభుత్వం నేడు, బుధవారం సాయంత్రం కీలక భేటీ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో పాక్ ఆక్రమిత కాశ్మిర్ లో సైతం మరోసారి ఉగ్రస్థావరాలపై సర్జికల్ స్ట్రైక్‌కు నిర్ణయం? తీసుకోనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల ప్రకారం.. కాశ్మీర్‌లోసమూలంగా ఉగ్రవాదులను ఏరివేసేందుకు.. లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లోని మోదీ నివాసంలో దేశంలోని కీలక నేతలతో ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ప్రధాని మోదీతో పాటు హోం మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌, నేషనల్ సెక్యూరిటీ సలహాదారుడు అజిత్‌ దోవల్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.గతంలో పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌లోని బాలకోట్‌లో తలదాచుకున్న ఉగ్రవాదులపై 2019లో సర్జికల్ స్ట్రేక్ జరిపిన సంగతి తెలిసిందే. అప్పట్లాగే ఈసారి కూడా పీవోకేలోని ఉగ్రవాదుల స్థావరాలపై మరో సర్జికల్‌ స్ట్రైక్‌ చేసేందుకు రంగం సిద్ధం అవుతుందా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *