సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం ఏపీ కాంగ్రెస్ అడ్జక్షురాలు వై ఎస్ షర్మిల మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ , మాజీ సీఎం జగన్ బాటలో ఏపీ సీఎం చంద్రబాబు నడవొద్దు. ఇక మీదట ఏపీ నుంచి అదానీకి ప్రాజెక్ట్స్ ఇవ్వొద్దు. మోదీ అదానీ వేర్వేరు కాదు. మోదీ అదానికి రక్షణ కల్పిస్తున్నారు.అదానీ మోదీకి డబ్బులు ఇస్తున్నారు. సెబీ చీఫ్ కూడా అదానీ చేతిలో ఉంది. అదానీపై అమెరికాలో కేసు నమోదు చేసిన భారతదేశంలో ఆయనపై ఎటువంటి చర్యలు లేవు. అదానీ వ్యవహారం మోదీకి , దేశానికి అవమానం. కాంగ్రెస్ అడిగే ఒక్క ప్రశ్నకు అయిన మోదీ సమాధానం చెప్పాలి. మోదీ అదానీనీ అమెరికాకు అప్పగిస్తారా? అదానీ టీం దేశంలో కొంతమంది సీఎంలకు లంచాలు ఇచ్చింది. ఇందులో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చింది. ఆగస్టు 2021లో జగన్‌కు ముడుపులు ముట్టాయి. పవర్ సప్లైలో అదానీ జగన్‌ను కలిసి మీకు ఏమి కావాలో ఇస్తామని ప్రామిస్ చేశారు’’ అని వైఎస్ షర్మిల గుర్తుచేశారు. జగన్ మోదీకి దత్త పుత్రుడు. ఆయన మీద విచారణ చేయిస్తారా?. అదానీపై జేపీసీ వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అదానీనీ బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలి. అదానీతో బిజినెస్ చేయొద్దు అన్నారు.
