సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కొందరికి క్షవరం అయితే కానీ వివరం రాలేదు.. అన్న సామెత చందాన భారత్‌తో అమెరికా స్నేహ సంబంధాల గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిలో ఆయన పన్నులపై పునరాలోచిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. భారత్, రష్యాలను చైనాకు కోల్పోయినట్టు చేసిన పోస్ట్ గురించి ట్రంప్‌ను విలేకరులు ప్రశ్నించారు. దానికి ఆయన స్పందిస్తూ.. ‘ప్రస్తుతం భారత్ వ్యవహరిస్తున్న తీరు.. చైనాను బలపరుస్తున్న తీరు నన్ను తీవ్ర నిరాశకు గురి చేసింది. రష్యా నుంచి పెద్ద మొత్తంలో వారు చమురు కొనుగోలు చేస్తున్నారు. వారు వెనక్కి తగ్గకపోవడంతోనే భారత దిగుమతులపై భారీ పన్నులు విధించా. నిజానికి భారత్‌పై విధించిన 50 శాతం పన్నులు చాలా ఎక్కువగానే ఉన్నాయి‘ అని ట్రంప్ ఒప్పుకొన్నారు. ‘మోదీ గొప్ప ప్రధాని. ఆయనతో నాకు వ్యక్తిగతంగా మంచి అనుబంధముంది. కానీ, ప్రస్తుతం ఆయన చేస్తున్నది నాకు నచ్చడం లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి భారత్-అమెరికా మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంది. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని నెలల క్రితమే మోదీ అమెరికాలో పర్యటించారు. మేమిద్దరం రోజ్ గార్డెన్లో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించామ’ని ట్రంప్ బాగా తగ్గి మాట్లాడారు. పేర్కొన్నారు.
