సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి, సోమవారం మధ్యాహ్నం రాజమండ్రి బహిరంగ సభలో ప్రధాని మోడీ వేదికపై అస్సినులయి ఉండగా ఏపీ సీఎం జగన్పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఐదేళ్లలో రాష్ట్ర అభివృద్ధి పడకేసిందని వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సొంత పథకాలుగా సీఎం జగన్ బిల్డప్ ఇచ్చారని విమర్శించారు. కేంద్ర నిధులతో నిర్మించిన గృహాలకు జగనన్న కాలనీలు అని పేరు పెట్టుకున్నారని విమర్శించారు. జగన్ హయాంలో కుంభకోణాలకు లెక్కే లేదని తెలిపారు. ‘జగన్ రాష్ట్రంలో ఐదు కోట్ల మందిని హింసింస్తున్నాడని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. జగన్ అవినీతి పాలన అంతమొందించేందుకు మోదీతో కలిసి పనిచేస్తున్నాం అని వివరించారు.మోదీ ముందుండి ఏపీని నడిపించాలని కోరారు. అయోధ్యకు శ్రీరామచంద్రుడిని తీసుకొచ్చిన మహానుభావుడు మోదీ అని’ ముచ్చటగా 3వ సారి ప్రధాని కావడం ఖాయం అని పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు.మోదీ వికసిత్ భారత్ కలలో తాము కూడా భాగస్వాములు అవుతామని స్పష్టం చేశారు. మోడీ కి శాలువా కప్పి సన్మానించిన పవన్ ఆయనకు వేదికపైనే పాదాభినందనం చెయ్యడం తో అందరు విస్తుపోయారు. మోడీ కూడా కాళ్లు మొక్కొద్దంటూ ఇది తగని పని అని చేతిని ఊపుతూ పవన్ తో అన్నారు.
