సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో ఇటీవల వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, శనివారం మీడియా తో మాట్లాడుతూ తాజగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు. అధికారంలో ఉన్న వైసీపీని 151 స్థానాల నుండి ఇప్పుడు 11 స్థానాలకు దిగజార్చిన నేతలలో కీలకమైన వ్యక్తి విజయసాయి రెడ్డి అని అతని కోటరీ విశాఖ, ఆంధ్ర లో చేసిన ప్రజా వ్యతిరేక పనులు వల్లే పార్టీకి ఈ గతి పట్టిందని ఇప్పటికైనా ఆయన రాజ్యసభ కు, పార్టీకి రాజీనామా చెయ్యడం హర్షణీయం అన్నారు. విజయసాయి రెడ్డి చేసిన అవినీతి నుండి తప్పించుకొనేందుకే పార్టీకి పదవులకు, రాజకీయాలకు దూరంగా జరిగి పోయారని ఆరోపించారు. విజయసాయి రెడ్డి తో పాటు సజ్జల, సుబ్బా రెడ్డి, శాసనమండలి చైర్మెన్ మోషేను రాజు, ప్రసాదరాజు లు కూడా రాజీనామాలు చేసి అందరూ కలసి వ్యవసాయం చేసుకొంటే మంచిదని ఎద్దేవా చేసారు. వీరు తమ కోటరీలతో పార్టీలో నిజాయితీ తో కస్టపడి ప్రజలు కోసం పనిచేసేవారిని బ్రష్టు పట్టించారని, వారి అనుయులకే పదవులు కట్టబెట్టారని విమర్శించారు.( up file photo)
