సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం మధ్యాహ్నం తాడేపల్లి నివాసంలో మీడియాతో ఇటీవల కూటమి సర్కార్ ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ ఫై మాట్లాడిన వైఎస్ జగన్.. బడ్జెట్‌లో అన్నీ అబద్ధాలు, చంద్రబాబు భజన మాత్రమే ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ లేదా సెవెన్ కు కేటాయింపులు ఎక్కడ? నిరుద్యొగులకు పింఛను, 50 ఏళ్లకు వృద్దాప్య పింఛను అమలు, కేటాయింపుల హామీల ఊసే లేదని, రాష్ట్ర జీడీపీ, జీఎస్‌డీపీపై చంద్రబాబు సర్కార్ అన్ని తప్పుడు లెక్కలు చెబుతోందని, నిజానికి రాష్ట్రము అన్ని రంగాలలో వెనుకబడి ఉందని నిజాలు దాస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాగ్ లెక్కలు చూస్తే రాష్ట్ర పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో తెలుస్తుందని పేర్కొన్నారు. మోసానికి ప్యాంట్, షర్ట్ వేస్తే అది చంద్రబాబు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. బడ్జెట్ లెక్కలు నిజమే అయితే.. ఏపీ ప్రజలు తలసరి ఆదాయం పెరగాలి కదా అని ప్రశ్నించారు. తమ హయాంతో పోల్చితే ప్రస్తుతం రాష్ట్ర ఆదాయ పరిస్థితి బాగోలేదని జగన్ తెలిపారు.దోచుకో.. దాచుకోవడానికి తప్ప ఎందుకు లక్షల కోట్లు అప్పులు తీస్తున్నారో తెలియడం లేదని అన్నారు, తమ 5 ఏళ్ల హయాంలో రూ.3,31,671 కోట్లు అప్పులు చేశామని.. కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం గత 18 నెలల్లోనే రూ.3,17,448 కోట్లని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.35 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని.. జీతాలు పెంచకుండా వారితో ఆటలు ఆడుతున్నారని విమర్శలు చేశారు.. చంద్రబాబు, లోకేష్, పవన్‌ కళ్యాణ్‌లకు ఒక విమానం, ఒక హెలికాఫ్టర్‌లు ఉన్నాయని వీళ్ళు హైదరాబాద్ లో నివాసాలు ఉంటె వాటి ఖర్చులు ప్రజలు భరించాలా? అని ప్రశ్నించారు. లోకేష్ క్రికెట్ మ్యాచ్ చూడటానికి ప్రత్యేక విమానంలో కొలంబో వెళ్లాలా? అని ప్రశ్నించారు జగన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *