సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రముఖ సీనియర్ సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ చిచ్చు ఇప్పట్లో ఆరేటట్లు లేదు.. తాజగా నేడు, బుధవారం హైదరాబాద్ సమీపంలో జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. తనను ఇంట్లోకి రానివ్వడం లేదంటూ మంచు మనోజ్ (Manchu Manoj) నిరసన వ్యక్తం చేస్తూ మోహన్ బాబు ఇంటి గేటు వద్ద కూర్చుని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అక్కడకు భారీగా సుమారు 100 మంది పోలీసులు చేరుకున్నారు. మంచు టౌన్ వద్దకు ఎవరిని అనుమతించనడం లేదు. మంచు టౌన్ కు దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటీవల తన నివాసంలో చోరీ జరిగిందంటూ పహాడీ షరీఫ్ పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. తన అన్న మంచు విష్ణు తన ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేసి తన కార్లను దొంగలించారంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం కార్లను పోలీసులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఇదే నేపథ్యంలో నేడు,మంచు మనోజ్ జల్‌పల్లిలోని నివాసానికి వెళ్లడానికి యత్నించాడు. అయితే గేటు ఓపెన్ చేయకపోవడంతో నిరసనకు దిగారు.
