సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా ప్రజలు తమ భవిష్యత్తు అవసరాల కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే అందులో మీరు ఒకరైతే.. .. ఇప్పటికే యుటిలిటీ బిల్స్, బ్యాంక్ స్టేట్‌మెంట్ సమర్పించి కేవైసీ పూర్తి చేశారా? అయితే మీరంతా మరోసారి తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవల్సిందే. దీనికి సంబంధించి కేఫిన్‌టెక్, క్యామ్స్ డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందించింది. పాస్‌పోర్ట్, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, ఎన్ఆర్‌ఈజీఏ జాబ్ కార్డు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ లేదా ఎన్‌పీఆర్ లెటర్స్ వంటి వాటిలో ఏదైనా ఒకటి సమర్పించి ఈకేవైసీ అప్‌డేట్ చేయించుకోవాలి. ఈ ఆర్ధిక సంవత్సరం ముగింపు మార్చి 31వ తేదీ లోపు కేవైసీ అప్‌డేట్ చేసుకోకపోతే అకౌంట్ ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఆ ఖాతాపై భవిష్యత్తులో ఎటువంటి లావాదేవీలు చేయడానికి బ్రేక్ పడే అవకాశం ఉంది.. కాబ్బటి KYC కి సిద్ధం కండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *