సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్టీఆర్ , హుట్రిక్ రోషన్ లు హీరోలుగా మల్టీస్టార్ సినిమా ‘వార్ -2’ టీజర్ వచ్చేసింది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) బర్త్ డే సందర్భంగా ‘వార్ -2’ (War -2) టీజర్ ను సుదీర్ఘకాలంగా బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్స్ అందించిన ప్రఖ్యాత లావిష్ సినిమాల నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ అయన్ ముఖర్జీ దర్శకత్వంలో నిర్మించిన వార్ 2 సినిమా టీజర్ నుయాక్షన్ సీన్స్ దట్టించి నేడు మంగళవారం విడుదల చేసారు. వచ్చే ఆగస్టు 14న రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. 1.32 నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్ లో ప్రతి ఫ్రేమ్ లోనూ ఎన్టీఆర్ హాలీవుడ్ హీరోను తలపించారు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా దీనిని విడుదల చేస్తున్నామనే భావనతో కావచ్చు… హృతిక్ రోషన్ కంటే ఎన్టీఆర్ కే మేకర్స్ ఎక్కువ చోటు కల్పించారు. అలానే కియారా అద్వానీ ఒక్క చోటే అలా మెరిసినా… అది స్విమ్ సూట్ లో అందాలు ఆరబోతతో కావడం కుర్రకారు మర్చిపోలేరు. ఇక యాక్షన్ సీన్స్ అయితే హుట్రిక్ రోషన్ ఎన్టీఆర్ పోటీ పడ్డారు.
