సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రభుత్వ రీ సర్వే పూర్తి అయిన గ్రామాలలో భూమి రికార్డుల్లో తప్పులను సరిచేసి రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను అర్హులైన వారికి పంపిణీ చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. భీమవరం మండలం యనమదుర్రు గ్రామంలో నేడు, శుక్రవారం మీ భూమి మీ హక్కు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో 512 మందికి పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే అంజిబాబు అందించి మాట్లాడారు. రెవెన్యూ సేవలను ప్రజల ముంగిటికే తీసుకుని వచ్చామని, పాత పట్టాదారు పాస్ పుస్తకాలను సంబంధిత రెవెన్యూ అధికారులకు అందజేసి కొత్త పాస్ పుస్తకాలను పొందాలన్నారు. దీనికి ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదని, రెవిన్యూ సేవలన్నీ గ్రామస్థాయిలో అందించడం జరుగుతుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రావి రాంబాబు, గ్రామస్తులు, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
