సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో గత 4 రోజులుగాఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయాని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరంలోని 26,28,38,39 వార్డులోని ముంపు ప్రాంతాలను ఎమ్మెల్యే అంజిబాబు పరిశీలించారు. భీమవరం పట్టణం నడిబొడ్డున ప్రవహించే యనమదుర్రు డ్రెయిన్ కాలువ ప్రవాహం ఉదృతంగా ప్రవహిస్తుందని, ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక కూడా ఇవ్వడం జరిగిందని, మూడో ప్రమాద హెచ్చరిక రాక ముందే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. చేపల మార్కెట్ వద్ద యనమదుర్రు వంతెన నుంచి ప్రకాశం ప్రకాశం చౌక్ వరకు ఎక్కడ గండ్లు పడకుండా,వరదనీరు రాకుండా ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలని మున్సిపల్ కమిషనర్ శ్యామలకు సూచించారు. వర్షాలు తగ్గిన తరువాత యనమదుర్రు కాలువ గట్టులను మరింత ఎత్తు పెంచాలని, టెండర్లు పిలిచి గట్టులను పటిష్ఠం చేయాలని, ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీటిని ఎక్కువ మోటార్లు పెట్టీ తొడించాలని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఏం శ్యామల, జనసేన పట్టణ అధ్యక్షుడు చెన్నమల చంద్రశేఖర్, పొత్తూరి బాపిరాజు, వబిలిశెట్టి రామకృష్ణ, ఎఎంసి మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, ఇందుకూరి రామలింగరాజు, మైలబత్తుల ఐజాక్ బాబు, లంకి శ్రీనివాస్ రాట్నాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
