సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం మండలం యనమదుర్రు గ్రామంలో నేడు, మంగళవారం మంగళవారం ఇంటింటికి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా? అని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆరా తీశారు. గత మూడున్నరేళ్ల పాలనలో ప్రజలకు జరిగిన మేలును వివరించారు. ఇదిలా ఉండగా ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ..గతంలో సీఎం వై యస్ రాజశేఖర్ రెడ్డి మన భీమవరం ప్రజలకు కు ఎంతో మేలు చేసారని, ఇప్పుడు ,సీఎం జగన్ . అన్ని వర్గాల ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని రుణమాఫీ, అమ్మ ఒడి, రైతు, డ్వాక్రా మహిళలకు ఫీజు రీయింబర్స్‌మెంట్, జగన్ అన్న విద్యా వరం, ఆటో డ్రైవర్లు, నాయీబ్రాహ్మణులు, రజకులు, ఏడాదికి 10 వేలు. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తన తండ్రి సంక్షేమం కంటే రెండడుగులు ఉన్నతంగా నిలిచారు. అలాగే యనమదుర్రు డ్రెయిన్‌పై నాలుగు వంతెనలు నిర్మించి మా ప్రాంత ప్రజల సమస్యలను శాశ్వత ప్రాతిపదికన పరిష్కారిస్తున్నామని అన్నారు. . అప్రోచ్‌ల కోసం రూ.36 కోట్లు మంజూరు కాగా ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. అలాగే నియోజకవర్గ పరిధిలో ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు వాటర్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా 21 కోట్ల నిధులు కేటాయించడంతో పనులు కూడా ప్రారంభమయ్యాయన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు నాడు నేడు పథకం కింద సుమారు రూ.22 కోట్లతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశారు. విద్యార్థులకు విద్యనభ్యసించేందుకు దాదాపు ఒక్కొకటి 30 వేల రూపాయల విలువైన ట్యాబ్‌లను అందించారు.అని తమ పాలనలో చేసిన అభివృద్ధి వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *