సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ ఆంధ్ర ప్రదేశ్ సీఎం, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు యన్టీఆర్ పేరు వింటే చాలు తెలుగువారి మనస్సులు గర్వముతో పులకిస్తాయి. తెలుగు వారికీ రాముడు, కృష్ణుడు ఆయనే…తెలుగువారికి యన్టీఆర్ ఓ తెరచి ఉంచిన పుస్తకం..నేడు, ఆదివారం జనవరి 18వ తేదీన యన్టీఆర్ 30వ వర్ధంతి..ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడ ఉన్న, ఎన్టీఆర్ అభిమానులు, పెద్దఎత్తున నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఏపీ సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు,మంత్రి నారా లోకేశ్, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, మంత్రి లోకేశ్, నందమూరి బాలకృష్ణ, ఎంపీ పురందేశ్వరి..లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని ఆయనకు నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం 11 గంటలకుఆదివారం టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో నిర్వహించే ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
