సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నితిన్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘ఎక్స్‌ట్రా’. ఆర్డనరీ మాన్‌ అనేది ఉపశీర్షిక. శ్రీలీల కథానాయిక. ప్రముఖ కధ రచయిత వక్కంతం వంశీ దర్శకుడు. సుధాకర్‌రెడ్డి, నికితారెడ్డి నిర్మాతలు. ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్ర కోసం ‘యాంగ్రీ మాన్’ రాజశేఖర్‌ని ఎంచుకొన్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.గత సోమవారం ఆయన సెట్స్‌లోకి అడుగుపెట్టారు. ‘‘కథలో రాజశేఖర్‌ పాత్ర చాలా కీలకం. ఆయన లుక్‌ చాలా స్టైల్ గా ఉంటుంది. ఆయన రాకతో మా సినిమా బలం మరింత పెరిగింది. శరవేగంగా షూటింగ్ పూర్తీ చేసి డిసెంబరు 8న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామ’’ని దర్శక నిర్మాతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *