సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : మలయాళ సూపర్ స్టార్ హీరో మమ్ముటి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పాత్రలో ఆయన జీవితకథ ఆధారం గా తెరకెక్కి న బయోగ్రాఫికల్ మూవీ ‘యాత్ర’. మూవీ నాలుగేళ్ల క్రితం 2019 ఫిబ్రవరి 9న విడుదలై ఎంతటి సంచలనం సాధించిందో.. ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అన్న భోరోసా మాట వై ఎస్ జగన్ కు ఎన్నికలలో విజయానికి ఎలా బాట వేసిందో అందరికి తెలిసిందే.. ఈసినిమాకు అప్ప ట్లోనే ఈ చిత్రానికి సీక్వె ల్ ఉంటుందని ప్రకటించాడు దర్శకుడు మహి వి.రాఘవ.. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళా .. సీక్వె ల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నుంచి మొదలై CM గా ప్రమాణ స్వీకారం చేసే వరకూ ఉంటుందని ఇటీవల రివీల్ చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ని జులై 8న వైఎస్సా ర్ జయంతి సందర్భంగా ప్రకటిస్తారని అంతా భావిం చారు. కానీ వారం ముందే ‘యాత్ర-2’ సినిమా రిలీజ్ డేట్ తో సహా ప్రకటిస్తూ ఓ పోస్టర్ని విడుదల చేశాడు మహి. ఈమూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానున్న ట్లు ప్రకటించారు. తాజాగా రిలీజైన పోస్టర్ సినిమాపై .. ‘నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోం డి.. నేను వై.ఎస్ రాజశేఖరరెడ్డి కొడుకుని’అనే లైన్స్ ‘యాత్ర 2’ కథేంటో తెలియజేస్తుంది. ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. సీఎం జగన్ పాత్ర పోషిం చేదెవరనేది ఇంతవరకు ప్రకటించలేదు
