సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేను విన్నాను.. నేను ఉన్నాను.. అంటూ యాత్ర సినిమా వైసిపి పార్టీకి ఇచ్చిన భరోసా.. గత 2019ఎన్నికలకు ముందు ఎంత ఊపు ఇచ్చిందో అందరికి తెలుసు.. ఈ 2024 ఎన్నికలకు ముందు మరల యాత్ర 2′ సినిమా సిద్ధం అయ్యింది. ఈరోజు శుక్రవారం టీజర్ వచ్చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ జీవితం లో కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా తీసారని ఆ క్లిపింగ్స్ చూస్తుంటే అర్ధం అవుతుంది. మరోసారి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ము ట్టి నటించగా కొడుకుగా వై.ఎస్.జగన్ (జీవా) రాజకీయాల్లోకి రావటానికి కారణాలు.. సోనియా గాంధీ, చంద్రబాబు( మహేష్ మంజేరేకర్ ) పాత్రలను పోలిన సన్నివేశాలు చూపించారు. ఈ టీజర్లో ఓ చోట.. ‘ఉన్నదంతా పోయినా పర్లేదని తెగించిన.. జగన్ లాంటోడితో యుద్ధం చేయడం మనకే నష్టం మేడమ్’ అని సోనియాగాంధీతో ఓ పాత్రధారి.. శుభలేఖ సుధాకర్ చెప్పే సీన్.. ‘చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం అన్న .. కానీ ఒకవేళ గుర్తుపెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాట తప్పని కొడుకుగా మీరన్న ఆ చరిత్ర గుర్తుపెట్టుకుంటే చాలన్న ‘ అనే మరో సీన్.. ‘నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని‘ అని అసెంబ్లీలో జగన్ పాత్రధారి చెప్పే సీన్స్ బాగున్నాయి. యాత్ర 2′ సినిమాను డైరెక్టర్ మహివి రాఘవ. రూపొందించారు. ఈ ఫిబ్రవరి 8న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
