సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు దర్శకుడు సందీప్ వంగా పాన్ ఇండియా స్థాయిలో నిర్మించిన ‘యానిమల్’ 800 కోట్ల వసూళ్లతో ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికి తెలిసిందే .. సీనియర్ హీరో అనిల్ కపూర్, రణబీర్ కపూర్ తండ్రి కొడుకులుగా చేసిన అభినయం, ప్రముఖ హీరో బాబీ డియోల్ సూపర్ విలన్ గా నటించిన ఈ సినిమా రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం లో మితిమీరిన హింస స్త్రీలను కించపరిచే సన్నివేశాలు ఫై పలు వివాదాలు ఎదురుకొన్న యానిమల్ ఎట్టకేలకు ఈ చిత్రాన్ని జనవరి 26న ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఓటీటీ రిలీజ్ నిలిపివేయాలని ఢిల్లీ కోర్టులో వేసిన దావా నేపథ్యంలో ఈనెల 22న జరిగిన విచారణలో ఇరు పక్షాలకు రాజి అంగీకారం? కుదిరి సినిమా ఈ నెల 26న నెట్ ఫ్లెక్స్ లో రానున్నట్లు సమాచారం. మొత్తానికి దేశం యావత్తు ఎదురు చూస్తున్న ఈ సినిమా నిడివి 3 గంటల 29 నిమిషాల రన్ టైమ్ అయితే ఓటిటి లో అదనంగా మరో 10 నిమిషాల పాటు సీన్స్ అదనంగా చేరుస్తున్నారని సమాచారం..
