సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాక్ ప్రేరేపిత ఉగ్రదాడి కి అఖండ భారతం రగిలిపోతున్న వేళా .. ‘మింగుటకు మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె’ ..సామెత చందాన 130అణుబాంబు లు వేస్తా’ అంటూ హడావిడి చేస్తున్న పాక్ ను ప్యూహాత్మకంగా అష్టదిగ్బంధనం చేస్తున్న భారత్ సైన్యం ఏ క్షణాన అయిన పాక్ ఫై దాడి చేసి పాక్ ఆక్రమిత కాశ్మిర్ ను తిరిగి స్వాధీనం చేసుకోటానికి సర్వ సిద్ధంగా ఉందని విశేషకులు భావిస్తున్న నేపథ్యంలో.. భారత సాయుధ దళాల సామర్థ్యం పై తమకు పూర్తి విశ్వాసం ఉందని, పాక్ ఉగ్రవాదాన్ని అణచివేసే విషయం లో భారత సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్న ట్లు ప్రధాని నరేంద్రమోదీ నేడు, మంగళవారం ప్రకటించారు. ఆయన నివాసంలో దాదాపు 2గంటల పాటు సాగిన ఈ భేటీలో రక్షణ మంత్రి రాజనాధ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాల అధిపతులు, పాల్గొన్నారు. దేశంలో భద్రతతోపాటు సరిహద్దులో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు.
