సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మొత్తానికి ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం ముగిసిపోవడంతో నేడు, బుధవారం భారత స్టాక్ మార్కెట్లు (Indian Stock Market) ఉదయం నుండి ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ, క్రూడ్ ధరల పతనం, స్థిరమైన అమెరికన్ డాలర్ వంటి అనుకూల సంకేతాలతో మార్కెట్లు పుంజుకున్నాయి. ఈ క్రమంలో ఉదయం 10.20 గంటలకు సెన్సెక్స్ ఏకంగా 527 పాయింట్లు ఎగిసిపడి 82,582కి చేరింది. నిఫ్టీ కూడా 138 పాయింట్లు పెరిగి 25,441 వద్ద నిలిచింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 103, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 225 పాయింట్లు లాభపడింది. అంతర్జాతీయ మార్కెట్లు, ప్రధానంగా నాస్‌డాక్ 100 రికార్డు గరిష్ఠాలకు చేరుకోవడంతో భారత మార్కెట్లకు జోష్ వచ్చింది. నిజానికి నిన్నే మంగళవారం యుద్ధం ముగిసిందని ఒక దశలో స్టాక్ మార్కెట్ సూచీలు 1100 పాయింట్స్ పైగా పెరిగినప్పటికీ మరల ఇరాన్ ఇజ్రాయిల్ ట్రంప్ రాజీ ని ప్రక్కన పెట్టి ఇరుదేశాలు దాడులతో కుమ్మేసుకోవడంతో సూచీలు ఒక్కసారిగా లాభాలు బాగా వెనక్కి తగ్గాయి. మొత్తానికి గత సాయంత్రం ట్రంప్ తీవ్ర స్థాయిలో తొలిసారి ఇజ్రాయిల్ ను సైతం తీవ్రంగా హెచ్చరించడంతో యుద్ధం ముగిసింది. ప్రధాని మోడీ కూడా ఇరువురు మిత్ర దేశాలు ఇజ్రాయిల్ , ఇరాన్ అడ్జక్షులతో తో మాట్లాడుతూ యుద్ధం ఆపమని తనవంతు దౌత్య సహకారం అందించారు.
