సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకొన్నప్పటికీ ఇప్పటికే పాక్ లో సైన్యంలో రాజీనామాలు పరంపర రైతుల తిరుగుబాటు, బలూచిస్తాన్ దాడులు నేపథ్యంలో .. విదేశీ మదుపర్లు భారత మర్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇది మార్కెట్ పెరుగుదలకు కలిసి వచ్చింది. దీంతో భారత స్టాక్ మార్కెట్లు సూచీలు నేడు, మంగళవారం కూడా ఫై పైకి దూసుకొనిపోతున్నాయి. . ఆరంభం నుంచే సెన్సెక్స్, నిఫ్టీలు విశేషంగా రాణిస్తున్నాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు పెరిగి 80,500 పైన ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 100 పాయింట్లు పెరిగి 24,400 స్థాయిలో ఉంది. 30 సెన్సెక్స్ సూచీల్లో 23 లాభాల్లో ట్రేడింగ్ అవుతున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ షేర్లు 2.3% వరకు పెరిగాయి. కానీ సన్ ఫార్మా, పవర్ గ్రిడ్ మరియు నెస్లే షేర్లు మాత్రం క్షీణిస్తున్నాయి. ఇక నిఫ్టీలోని 50 స్టాక్స్‌లో 37 లాభాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాలున్నప్పటికీ దేశీ స్టాక్స్ రాణిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *