సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు దేశం పార్టీ కి పూర్వ వైభవం తిరిగి తేవడానికి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 4000 కిమీ మేర చేప్పట్టిన ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభమయింది. నేడు, శుక్రవారం ఉదయం సరిగ్గా 11.03 గంటలకు కుప్పం వరదరాజస్వా మి ఆలయం వద్ద నారా లోకేష్ తొలి అడుగు వేసి పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చా పురంలో ముగియనుంది. నేడు, మధ్యాహ్నం 3 గంటలకు కుప్పంకమతమూరు చేరుకొని అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. పాదయాత్ర కార్యక్రమానికి వేల సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. పాదయాత్ర సం దర్భంగా తొలి బహిరంగ సభకు లోకేశ్ అత్తామామలు వసుంధర, బాలకృష్ణతోపాటు పలువురు కుటుంబ సభ్యులు, టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్య క్షుడు అచ్చెన్నాయుడు హాజరు కానున్నారు. పాదయాత్రలో లోకేష్ రక్షణ కోసం 400 మంది ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.
