సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నారాలోకేష్ యువగళం పాదయాత్ర పూర్తీ అయిన నేపథ్యంలో నేడు, బుధవారం రాత్రి తెలుగు దేశం ఏర్పాటు చేసిన బహిరంగ సభకు జనసేనాని పవన్ ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు. పెద్ద ఎత్తున క్యాడర్ తరలి వచ్చింది.అయితే ఈ వేదికపై 2014 నాటి సీన్ రిపీట్ అయ్యింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దాదాపు పదేళ్ల తర్వాత ఒకే ఉమ్మడి బహిరంగ వేదికను పంచుకున్నారు..అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతిలో నిర్వహించిన ఎన్నికల సభలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు పవన్‌, చంద్రబాబు వేదికను పంచుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే బహిరంగ వేదికను పంచుకున్నారు. అయితే ఈ సారి నందమూరి బాలకృష్ణ మరో ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు. వక్తలు లోకేష్ పాదయాత్ర ను అభినందించి వైసిపి సర్కార్ ఫై తీవ్ర స్థాయి విమర్శలు చేసారు.నారా లోకేష్ చంద్రబాబు వారసుడే కాదు… రాజకీయ పరిణితి కలిగిన నాయకుడని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. పోలవరాన్ని పూర్తి చేయలేని చేతకాని ప్రభుత్వమని బాలకృష్ణ ధ్వజమెత్తారు. డ్రగ్స్ దందాలో మాత్రం రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచారని ఎద్దేవాచేశారు. వైసీపీ నేతలు శాండ్‌, ల్యాండ్‌ స్కామ్‌లతో కోట్లు దోచుకుంటున్నారని మండిపడ్డారు. అమరావతి రాజధాని ని అభివృద్ధి చేయకుండా గాలికొదిలేశారన్నారు. అమరావతికి భూములిచ్చిన రైతుల ఉద్యమాన్ని అణిచివేస్తున్నారని, రాజధాని కోసం పోరాడుతున్న ప్రజలపై అక్రమ కేసులు పెట్టడం బాధాకరమన్నారు. రాష్ట్ర భవిష్యత్తు ప్రజల చేతుల్లోనే ఉందని బాలకృష్ణ పేర్కొన్నారు. ఇంకా బహిరంగ సభ కొనసాగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *