సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో ప్రజలకు ఆధార్ సేవలను మరింత అందుబాటులోకి తేవడానికి కేంద్ర ప్రభుత్వం ఆధార్ సూపర్‌వైజర్, ఆపరేటర్ పోస్టుల భర్తీకి తాజగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా యువతకు తమ జిల్లాల్లోనే ఆధార్ సేవా కేంద్రాల్లో (ASKలు) పనిచేసే అవకాశం లభిస్తోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ csc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానికంగా ఉండి ఉద్యోగం చేసుకోవాలనుకునే యువతకు ఇది శుభవార్తే. . దరఖాస్తుల చివరి తేదీ: మార్చి 10, 2026. గడువు తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేయడం మంచిది.ఈ నియామక డ్రైవ్‌లో భాగంగా మొదటగా మొత్తం 252 పోస్టులు భర్తీ చేయనున్నారు.కనీసం 18 ఏళ్ళ వయస్సు దాటి 12వ తరగతి ఉత్తీర్ణత లేదా 10వ తరగతి + 2 సంవత్సరాల ఐటీఐ కోర్సు లేదా 10వ తరగతి + 3 సంవత్సరాల పాలిటెక్నిక్ డిప్లొమా చదివి ఉండాలి. జిల్లాల వారీగా ఖాళీలను పూరిస్తారు ఎంపికైన అభ్యర్థులు ఆధార్ సేవా కేంద్రాల్లో ఆధార్ నమోదు, అప్‌డేట్‌లు, ఇతర సేవలు నిర్వహించాల్సి ఉంటుంది.మీ జిల్లాకు సంబంధించిన “Apply Now” లింక్‌పై క్లిక్ చేయండి. పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్, పాన్, జనన తేది వంటి వివరాలు నమోదు చేయండి. అవసరమైన పత్రాలు (రెజ్యూమ్, సంబంధిత సర్టిఫికెట్) అప్‌లోడ్ చేయండి.
