సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టీడీపీ అధినేత చంద్రబాబు ఈసారి ఎన్నికలలో గతంలో 2014 ఎన్నికల ప్రచారం లో ‘ బాబు వస్తే జాబు వస్తుంది’ అని ప్రచారం చేసినట్లే.. తాజగా ప్రజాగళం యాత్రలో యువత లక్ష్యంగా అదే అస్త్రాన్ని కాస్త మార్చి ప్రయోగిస్తున్నారు. నేడు, బుధవారం చంద్రబాబు పలమనేరులో సభలో మాట్లాడుతూ.. సీఎం జగన్ హయాంలో యువతకు చేసింది ఏమి లేదని..అంత మోసమేనని, తమ కూటమి అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. జగన్ సర్కార్ రాయలసీమ అభివృద్ధికి జగన్ చేసిందేమి లేదన్నారు. అనంతపురానికి నీళ్లు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనన్నారు. కియా పరిశ్రమను అనంతపురం జిల్లాలో ఏర్పాటయ్యేలా టీడీపీ ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు.రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు దివంగత నేత ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని, ఆ ప్రాజెక్టులను తాను మరింత అభివృద్ధి చేశానని తెలిపారు. జగన్ సిద్ధం.. మేమంతా సిద్ధం అంటూ మరో మెసపూరిత యాత్రకు ప్రజల మధ్యకు వస్తున్నారని.. ఆయనకు ఖాళీ రోడ్లతో స్వాగతం పలకాలని.. ఖాళీ రోడ్డులు చుస్తే జగన్ కు బుద్ది వస్తుందని అన్నారు. జగన్ రాయలసీమ ద్రోహి అని, ఏపీని జగన్ సర్వ నాశనం చేశారని విమర్శించారు. రాష్ట్ర భవిష్యత్తు మార్చే రోజు మే13వ తేదీ తో రాష్ట్రానికి పట్టిన జగన్ అనే శని వదిలిపోతుందని చంద్రబాబు ఆగ్రహం, ఆశాభావం వ్యక్తం చేసారు.
